బోస్టన్‌లో TANA ఆధ్వర్యంలో బ్యాక్‌ప్యాక్‌ల విరాళం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

గ్రేటర్ బోస్టన్ ప్రాంతంలో TANA న్యూ ఇంగ్లాండ్ విభాగం ఆధ్వర్యంలో ‘బ్యాక్-టు-స్కూల్ బ్యాక్‌ప్యాక్ విరాళాల కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. TANA అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి పర్యవేక్షణలో, ప్రాంతీయ కోఆర్డినేటర్ మౌనిక మనుకొండ నాయకత్వంలో ఆరు స్థానిక పాఠశాలలకు చెందిన నిరుపేద విద్యార్థులకు సుమారు 200 పాఠశాల బ్యాక్‌ప్యాక్‌లను అందజేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఈ సాయం ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.