షూటింగ్స్‌తో బిజీ కానున్న నందమూరి బాలకృష్ణ
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న నందమూరి బాలకృష్ణ త్వరలో షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా' సినిమాతో పాటు, అక్టోబర్ తొలివారం నుంచి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న 'ఎన్‌బీకే 112' చిత్ర షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. డిసెంబర్ 24న 'దాదా' సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.