ఇచోడలో అటవీ శాఖ కొరడా: అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఇచోడ
మండలంలో అక్రమంగా తరలిస్తున్న విలువైన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఇంచార్జి ఎఫ్ఆర్ఓ ఇబ్రహీం శరీఫ్ వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండలం గుండి వాగు రోడ్డులో అటవీ అధికారులు గురువారం వేకువజామున నిర్వహించిన తనిఖీల్ లో ఈ అక్రమ రవాణా గుట్టురట్టయింది. అధికారుల గస్తీని గమనించిన స్మగ్లర్లు కలపను అక్కడే వదిలేసి పరారయ్యారని, ఈ దాడిలో పలువురు అటవీ సిబ్బంది పాల్గొన్నారని ఆయన స్పష్టం చేశారు.