రైళ్లలో నిద్రవేళల నిబంధన సమర్థన: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: చెన్నై

రైళ్లలో ప్రయాణికుల నిద్ర వేళలపై భారతీయ రైల్వే తీసుకొచ్చిన నిబంధనలు సరైనవేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసినట్లు న్యాయవర్గాలు తెలిపాయి. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే బెర్తులపై పడుకోవాలని, మిగతా సమయంలో కూర్చోవాలనే నిబంధన ప్రయాణికులందరి సౌకర్యాన్ని బ్యాలెన్స్ చేస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి ధర్మాసనం పేర్కొంది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ చెన్నైకి చెందిన బి. బాలసుబ్రమణియన్ దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు కొట్టివేసింది.