ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వెయ్యి మంది మహిళలకు ఉచిత శిక్షణ ప్రకటించిన రామ్ చరణ్
రిపోర్టర్: సతీష్
స్థలం: భారతదేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ ఒక గొప్ప సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూనే, సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాబోయే కొద్ది నెలల్లో 1,000 మంది మహిళలకు ఉచితంగా ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నట్లు ప్రకటించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్న ఆయన ఉదార నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.