ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో భారీగా పడిపోయిన వరి సాగు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఎల్నినో ప్రభావం కారణంగా వరి సాగు మరియు ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోయినట్లు ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నివేదిక స్పష్టం చేసింది. వర్షాకాలం సీజన్ మొదట్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం పదహారు శాతం తగ్గిందని, ముప్పై ఏడు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.