బ్యాంకుల బంద్ వేళ ఆదివారం కూడా సేవలు అందించనున్న ఎస్బీఐ

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

యూఎఫ్బీయూ పిలుపునిచ్చిన మూడు రోజుల బ్యాంక్ బంద్ నేపథ్యంలో వినియోగదారుల సౌకర్యార్థం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 27 ఆదివారం రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తి స్థాయిలో తెరిచి పనిచేస్తాయని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా ఐదు రోజుల పాటు సేవలు నిలిచిపోకుండా ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు.