తిమ్మాపురం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: ఇద్దరు మహిళలు దుర్మరణం
రిపోర్టర్: మహేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా తిమ్మాపురం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు చెందిన భక్తులు తలుపులమ్మ ఆలయానికి వెళ్తుండగా ఆటోను అంబులెన్స్ ఢీకొట్టిందని వారు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.