అమెరికా గడ్డపై సత్తా చాటిన ఖమ్మం ఆడబిడ్డ రాధిక
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మంలో జన్మించిన రాధికా రామసహాయానికి అమెరికాలోని ఓహియో రాష్ట్ర మైనారిటీ డెవలప్మెంట్ ఫైనాన్సింగ్ అడ్వైజరీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా అరుదైన గౌరవం దక్కింది. గవర్నర్ మైక్ డివైన్ ఆమెను తిరిగి నియమించగా ఏడేళ్ల పదవీకాలం కొనసాగనుంది. కోవిడ్ సమయంలో ఆమె అందించిన సేవలు ప్రత్యేక గుర్తింపు పొందగా ఈ విజయ ప్రస్థానం ఖమ్మం ప్రాంతానికి గర్వకారణంగా నిలుస్తూ మహిళలకు చక్కటి స్ఫూర్తిని అందిస్తోంది.