రోడ్డు భద్రత కోసం హెల్మెట్ ధరించాలని పోలీసుల పిలుపు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఏలూరు
ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలని ఏలూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ అనేది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, అది మీ ప్రాణాలను కాపాడే కీలకమైన బాధ్యత అని గుర్తు చేశారు. మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తున్న కుటుంబం కోసం ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు.