హైదరాబాద్ అభివృద్ధిపై బ్లూమ్‌బెర్గ్ ప్రశంసలు గర్వకారణం
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లో వస్తున్న వేగవంతమైన మార్పును బ్లూమ్‌బెర్గ్ ప్రశంసించడంపై ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. గత రెండేళ్లలో చేపట్టిన బలమైన పరిపాలన, నిర్ణయాత్మక అమలు వల్లే ఈ భారీ పరివర్తన సాధ్యమైందని స్పష్టం చేసింది. బిగ్ టెక్ కంపెనీలు హైదరాబాద్‌పై నమ్మకం ఉంచడానికి ప్రణాళికాబద్ధమైన విధానాలే కారణమని ప్రభుత్వం పేర్కొంది.