మేఘాలయాలో రాజకీయ సంచలనం ఎనిమిది మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక
రిపోర్టర్: సురేష్
స్థలం: Meghalaya
మేఘాలయాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వం సమక్షంలో అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చేరికతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. లఖ్మెన్ రింబ్యూ, కైర్మెన్ షిల్లా, ఓలన్ సింగ్ సుయిన్, మాథ్యూ బియాండ్స్టార్ కుర్బా, మైరల్బోర్న్ సైయెమ్, పియస్ మార్వీన్, సిన్షర్ థబా, బాలాజిద్ సిన్స్రీమ్ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు.