క్యారీ బ్యాగ్‌ వివాదం: షాపర్స్ స్టాప్‌కు అనుకూలంగా తీర్పు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో పది రూపాయల క్యారీ బ్యాగ్‌ కోసం వినియోగదారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా కన్‌జ్యూమర్‌ కమిషన్‌ కొట్టివేసింది. దురుద్దేశపూర్వకంగా తప్పుడు కేసు వేసినందుకు పిటిషనర్‌కు రూ. 10 వేల జరిమానా విధించింది. ఇందులో రూ. 5 వేలు రిటైలర్‌కు, మరో రూ. 5 వేలను కన్‌జ్యూమర్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది.