ఎస్సార్ఎఫ్టీఐలో తీవ్ర కలకలం: వైస్ చాన్సలర్ సంతోష్ అజ్మీరాపై విద్యార్థి దాడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: Kolkata
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ వైస్ చాన్సలర్ సంతోష్ అజ్మీరాపై ఒక విద్యార్థి దాడికి పాల్పడటంతో పాటు మరికొందరు దుర్భాషలాడినట్లు ఇన్స్టిట్యూట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన కార్యాలయం ధ్వంసమైన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్లో జరిగిన ఈ దాడి ఆందోళనకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రతా సమస్యలపై విద్యార్థుల సంఘం గత పదిహేడు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం తీవ్ర కలకలం రేపింది.