రూ వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులన్నీ రాసిస్తానంటూ సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబ ఆస్తులన్నీ తీసుకుని వెయ్యి కోట్లు ఇస్తే ఎక్కడైనా సంతకం చేయడానికి సిద్ధమని, ఆ డబ్బుతో కాంగ్రెస్ హామీలు నెరవేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.