హైదరాబాద్ కు రాకా మూవీ కీలక షెడ్యూల్: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రాకా సినిమాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది అని సినీ వర్గాలు తెలిపాయి. దుబాయ్ లో జరగాల్సిన ఈ సినిమా కీలక షెడ్యూల్ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మార్పు వల్ల ప్రయాణ భారం తగ్గడంతో పాటు షూటింగ్ మరింత సౌకర్యవంతంగా సాగుతుందని చిత్ర బృందం భావిస్తోంది.