విద్యార్థులకు శుభవార్త: భారీ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ప్రారంభం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
దేశవ్యాప్తంగా విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు భారీ స్కాలర్‌షిప్‌లను ప్రకటించాయి. పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.1.50 లక్షలు, దివ్యాంగ డిగ్రీ విద్యార్థులకు ఏటా రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందనుంది. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా అక్టోబరు 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన కింద పాఠశాల విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.