నేపాల్ లో హెలికాప్టర్ల ఢీ: ప్రమాదంలో భారత జాతీయుడు దుర్మరణం

రిపోర్టర్: హరి స్థలం: Solukhumbu

నేపాల్ లోని సోలుఖుంబు జిల్లాలో పెరిచే హెలిప్యాడ్ పై ల్యాండింగ్ అవుతుండగా రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ప్రమాదంలో ఒక భారత జాతీయుడు మరణించినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరో ప్రయాణికుడితో పాటు పైలట్ గాయపడ్డారు. మృతుడిని 47 ఏళ్ల వసంత్ కుమార్ బలరా మాడుగా గుర్తించగా, క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.