ఎడారి రాజస్థాన్లో ఆలివ్ సాగు: సరికొత్త వ్యవసాయ విప్లవానికి శ్రీకారం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Rajasthan
సాధారణంగా మధ్యధరా దేశాల్లో పండే ఆలివ్ పంటను రాజస్థాన్ ఎడారి ప్రాంతంలోనూ విజయవంతంగా సాగు చేస్తున్నట్లు వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఇజ్రాయెల్ సహకారంతో ఆధునిక డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు పాటిస్తూ అక్కడి రైతులు ఈ సాగును విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. బికనేర్ కేంద్రంగా ఆలివ్ ఆయిల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి, దేశీయ ఉత్పత్తిని పెంచుతూ రైతులకు అదనపు ఆదాయం సమకూరుస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు.