టాలీవుడ్కు దూరంగా ఉండటానికి కారణం చెప్పిన నటుడు ఎల్బీ శ్రీరాం

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

సినీ పరిశ్రమకు కొంతకాలంగా తాను దూరంగా ఉండటానికి గల కారణాలను సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరాం స్పష్టం చేశారు. తనకు తగిన పాత్రలు రాకపోవడం వల్లే సినిమాలలో కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నటనపై ప్రేమతోనే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నానని చెప్పారు. త్వరలో ఆయన నటించిన గరివిడి లక్ష్మి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలిపారు.