అస్సాం ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు స్టే
రిపోర్టర్: గోపి
స్థలం: అస్సాం
అస్సాం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు మరియు సర్వీసుల క్రమబద్ధీకరణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ప్రావిన్షియలైజేషన్ పథకంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత ధర్మాసనం, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని ఆదేశించింది. కేంద్ర, అస్సాం ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.