వైఎస్ జగన్ చేతుల మీదుగా చిన్నారి అక్షరాభ్యాసం
రిపోర్టర్: రాము
స్థలం: ఏలూరు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కె. నాగబాబు కుమార్తె సహర్షిత అక్షరాభ్యాస కార్యక్రమం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. చిన్నారిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్న వైఎస్ జగన్, పలకపై స్వయంగా ఓనమాలు దిద్దించి విద్యారంభం చేయించారు. తమ నేత చేతుల మీదుగా బిడ్డ చదువు ప్రారంభం కావడం పట్ల నాగబాబు కుటుంబ సభ్యులు అమితానందం వ్యక్తం చేశారు.