పెరిగిన ధరలతో ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సంక్షోభంలోకి

రిపోర్టర్: సునీల్ స్థలం: Kadapa

నిత్యావసర సరకుల ధరలు అనూహ్యంగా పెరుగుతుండటంతో విద్యార్థులకు అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీవ్ర సంక్షోభంలో పడిందని నిర్వాహకులు తెలిపారు. మార్కెట్ ధరలకు తగినట్లుగా వంట ఛార్జీలు చెల్లించకపోవడంతో పాటు మూడు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వారు వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మెనూ ఛార్జీలను పెంచాలని, లేదంటే పథకం నాణ్యత దెబ్బతింటుందని వంట కార్మికులు హెచ్చరిస్తున్నారు.