గాజువాక సత్తెమ్మ తల్లి ఆలయంలో సిద్ధి వినాయక అన్నసమారాధన
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
గాజువాక నియోజకవర్గ పరిధిలోని అరవపల్లి 65వ వార్డు రాజీవ్ మార్గ్ వద్ద వెలసిన శ్రీ సత్తెమ్మ తల్లి గుడి ప్రాంగణంలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయకుని అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో గాజువాక వైఎస్సార్సీపీ ఇంచార్జీ తిప్పల దేవన్ రెడ్డి, 64వ వార్డు ఇంచార్జీ ధర్మాల శ్రీను, 65వ వార్డు ప్రెసిడెంట్ మద్దాల అప్పారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.