సేవా సంకల్ప్ అభియాన్: బెల్లంపల్లిలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ నాయకులు అమురాజుల శ్రీదేవి, పట్టి వెంకటకృష్ణ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని కొనియాడారు.