అమెరికా మెగా సిటీల పగ్గాలు మనోళ్ల చేతుల్లోకి: నిత్యా రామన్ ఘనవిజయం
రిపోర్టర్: రాజేష్
స్థలం: లాస్ ఏంజెల్స్
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ మేయర్గా భారత మూలాలు ఉన్న నిత్యా రామన్ భారీ మెజార్టీతో విజయం సాధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్ పై గెలుపొందిన ఆమె, జనాభా పరంగా రెండో పెద్ద నగరమైన ఆ ప్రాంతానికి ప్రథమ పౌరురాలు కానున్నారు. కేరళలో జన్మించిన నిత్య, అర్బన్ ప్లానింగ్ లో మాస్టర్స్ పూర్తి చేసి అమెరికా రాజకీయాల్ లో తన ప్రత్యేక ముద్ర వేయడంతోపాటు అమెరికాలో భారతీయుల కీర్తిని మరింత ఇనుమడింపజేశారు.