యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 402వ ర్యాంక్ సాధించిన గూగుల్ ఇంజనీర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

గూగుల్ సంస్థలో స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూనే అమెరికాలో ఉండి సివిల్స్ పరీక్షలకు సిద్ధమైన పియూష్ కపూర్ ఐదుసార్లు ప్రయత్నించి ఆలిండియా 402వ ర్యాంక్ సాధించారని అధికారులు తెలిపారు. అమెరికా నుంచి భారత్కు పదివేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ ఉద్యోగ బాధ్యతలతో పాటు రోజూ రెండు నుంచి మూడు గంటలు కష్టపడి చదివానని ఆయన పేర్కొన్నారు. వీకెండ్లలో ఎక్కువ సమయం కేటాయించి గణితాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకుని సివిల్స్లో విజయం సాధించానని పియూష్ కపూర్ వెల్లడించారు.