విద్యుత్ స్తంభం ఎక్కి భద్రతా ప్రమాణాలను పరిశీలించిన TGSPDCL సీఎండీ
రిపోర్టర్: విజయ్
స్థలం: Malkaram, Telangana
TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్ వినూత్నంగా స్పందించారు. 'ప్రజా బాట - బస్తీ బాట' కార్యక్రమంలో భాగంగా మల్కారం గ్రామంలో స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి క్షేత్రస్థాయి పరిస్థితులను, సిబ్బంది పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో ఇలా నేరుగా పాల్గొనడంపై విద్యుత్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బాధ్యతాయుతమైన పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.