భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొంగులేటి ఆదేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.