నారాయణపేట జిల్లా మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్‌తో ముప్పై మంది విద్యార్థినులకు అస్వస్థత

రిపోర్టర్: రాము స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇంటర్ చదువుతున్న బాలికలకు భోజనం తర్వాత కడుపునొప్పి రావడంతో స్కూల్ సిబ్బంది అప్రమత్తమై స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా అస్వస్థతకు గురైన మరో పదిహేను మంది విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.