కేరళ రంజీ జట్టు హెడ్ కోచ్‌గా స్వప్నిల్ అస్నోడ్కర్ నియామకం
రిపోర్టర్: గోపి
స్థలం: కేరళ
కేరళ రంజీ ట్రోఫీ జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ ఐపీఎల్ స్టార్ స్వప్నిల్ అస్నోడ్కర్ నియమితులయ్యారు. గత సీజన్ ముగింపులో అమేయ్ ఖురాసియా తప్పుకోవడంతో కేరళ క్రికెట్ అసోసియేషన్ ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది అస్నోడ్కర్ కేరళ అండర్-23 కోచ్‌గా సేవలు అందించారు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ముందుకు నడిపించడంలో ఆయన సరైన ఎంపిక అని కేసీఏ భావించింది. జలజ్ సక్సేనా, ఆదిత్య సర్వతే రాకతో బౌలింగ్ బలపడిందని, బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు అస్నోడ్కర్ తెలిపారు.