నెల్లూరులో ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకుండా పటిష్ఠ ప్రణాళికతో ముందుకెళుతున్నామని నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు.