తీపి కబురు: ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ధరల తగ్గింపుపై కసరత్తు

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు మరియు మెట్రో రైళ్లలో ప్రయాణించే నిత్య ప్రయాణికులకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది. కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయంటూ వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పాస్ ధరల సవరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.