మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మొర్రిగూడలో సోమవారం రోజున సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి సాంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.