హైదరాబాద్‌లో అడ్డగోలుగా పెరిగిన ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. నెల క్రితం క్వింటాల్ రూ. 2,000 ఉన్న మహారాష్ట్ర ఉల్లి ధర రూ. 5,000కు చేరుకోగా, అల్లం రూ. 16,000, వెల్లుల్లి క్వింటాల్ రూ. 19,000కు చేరింది. వర్షాభావ పరిస్థితులు, దిగుబడులు తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.