తాడికొండలో ఎమ్మెల్యే ఆనందరావు హల్చల్: డీఈని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: Tadikonda, Andhra Pradesh
తాడికొండలో సాగునీటి డ్రెయిన్ పనుల నిలిపివేతపై రైతులు ఎమ్మెల్యే ఆనందరావును నిలదీశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న డీఈని చెప్పుతో కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.