నర్సంపేటలో ఓటర్ల ప్రత్యేక నమోదు ప్రక్రియపై మాజీ కౌన్సిలర్ సమీక్ష

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. 155, 156 బూత్ ల పరిధిలో నోటీసులు అందుకున్న ఓటర్లలో ఇప్పటివరకు 242 మంది ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్ కు అందజేసి తమ ఓటు హక్కును పునరుద్ధరించుకున్నారు. ఇంకా 70 నుంచి 80 మంది ఓటర్లు రావాల్సి ఉండటంతో త్వరలో మరో విచారణ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.