కల్వకుర్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ ఇంచార్జిగా బొడ్డు శంకర్ నియామకం కావడం విశేషం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మాడ్గుల్

కల్వకుర్తి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నాయకులు బొడ్డు శంకర్ నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ఈ నియామకం చేపట్టారు. పట్టభద్రుల ఓటరు నమోదులో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు. తనకు బాధ్యతలు అప్పగించినందుకు నాయకులకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.