కుప్పంలో అత్యాధునిక రైతు బజార్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
రిపోర్టర్: మహేష్
స్థలం: కుప్పం
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యాధునిక హంగులతో కూడిన రైతు బజార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతు బజార్‌తో పాటు కోల్డ్ స్టోరేజీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ మరియు సోలార్ విద్యుత్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెటింగ్ అభివృద్ధి లక్ష్యంగా ఈ కీలక ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.