ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5తో సమావేశమయ్యారు. చారిత్రక కట్టడాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సేవలను సీఎం కొనియాడారు. సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు సహకరించాలని కోరారు. డిసెంబర్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ఆయనను ఆహ్వానించారు.