విజయవాడలో ఆసక్తికర దృశ్యం: వంగవీటి రాధాకృష్ణ, ఏబీ వెంకటేశ్వరరావు ఆలింగనం

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గుణదల ప్రాంతంలో ఆదివారం కూటమి నాయకులు భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార పర్వంలో భాగంగా కూటమి తరఫున కీలక భూమిక పోషిస్తున్న వంగవీటి రాధాకృష్ణ అదే ప్రాంతంలో ఉన్నారు.