స్మార్ట్‌ఫోన్‌లు వదిలి వ్యవసాయ పనులు చేస్తున్న అమెరికా విద్యార్థులు

రిపోర్టర్: సురేష్ స్థలం: Vermont

అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రంలో గల మౌంటెన్ స్కూల్ వినూత్న రీతిలో విద్యనందిస్తోంది. ఒక్క సెమిస్టర్‌కు నలభై వేల డాలర్లు చెల్లించే ఈ పాఠశాలలో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లను వదిలేసి వ్యవసాయ పనులు, వంట చేయడం, పశువులను మేపడం వంటి పనులు చేస్తున్నారు. కేవలం చదువు మాత్రమే కాకుండా సమాజంలో బాధ్యతాయుతంగా నడుచుకునేలా, స్వతంత్రంగా బతికేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ విద్యా సంస్థ విభిన్నమైన బోధనా పద్ధతులను అమలు చేస్తోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.