సల్మాన్ ఖాన్‌తో భువన్ బామ్ సిరీస్ వీక్షణ

రిపోర్టర్: సురేష్ స్థలం: India

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి ప్రముఖ నటుడు భువన్ బామ్ తన తాజా వెబ్ సిరీస్ 'ది రెవల్యూషనరీస్' వీక్షించారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో భువన్ రాస్ బిహారీ బోస్ పాత్రలో నటించారు. సల్మాన్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిరీస్ దర్శకుడు కూడా పాల్గొన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.