నాగర్ కర్నూల్ జిల్లాలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: నాగర్ కర్నూల్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచనల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా తుడుకుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీసీఎస్ సీఐ శంకర్ విద్యార్థులకు, ప్రజలకు సైబర్ మోసాల పట్ల పలు కీలక సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.