'రూ.13.41 కోట్లతో డీఎస్ఆర్ హైస్కూల్ అభివృద్ధి': నెల్లూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన
రిపోర్టర్: అశోక్
స్థలం: Nellore
నెల్లూరు మూలాపేటలో రూ.13.41 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో పునర్ నిర్మించిన దేవిరెడ్డి శారద (డీఎస్ఆర్) ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో ముచ్చటించి వారితో సెల్ఫీలు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.