వివేకా హత్య కేసు నిందితులను జగన్ కాపాడుతున్నారు: దస్తగిరి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిలకు వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ రక్షణ కల్పిస్తున్నారని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తునకు జగన్, భారతి ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. తనపై జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు.