నర్సంపేట అంగడి మైదానంలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేటలోని అంగడి మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలంకరణలతో మైదానం శోభాయమానంగా మారింది. ఏటా ఇక్కడ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, వెలుతురు తదితర సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.