కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ప్రజాప్రతినిధులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో గ్రామపంచాయతీ వాటర్ మెన్ అనారోగ్యంతో ఇటీవల మరణించగా ఆదివారం గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు ఆ కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బూరుగు రమేష్ గౌడ్, బాల్ద చంద్రయ్య, పాండవుల లక్ష్మణ్ గౌడ్, బూత్కూరి నరసింహారెడ్డి, ఎర్రగుంట సునీల్ తదితరులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు.