పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్తున్న మిత్రులను ఆత్మీయంగా సన్మానించిన ప్రముఖులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాగజ్ నగర్
సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కాకు ఉమ్రా యాత్ర నిమిత్తం బయలుదేరుతున్న జావిద్ మరియు సాజిత్ లను మిత్రులు జలీల్ మిర్జా, ఫెరోజ్, చిచ్చా తదితరులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అల్లాహ్ వారి యాత్రను పూర్తిగా సఫలం చేయాలని, వారి ప్రార్థనలను అంగీకరించి ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా తిరిగి ఇంటికి చేరేలా చూడాలని అందరూ మనస్ఫూర్తిగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.