డీయూఎస్‌యూ ఎన్నికల విజయ యాత్రలపై ఢిల్లీ హైకోర్టు నిషేధం

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో ఆయుధాలు ప్రదర్శించడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత రోడ్లు, క్యాంపస్, హాస్టళ్లలో ఎలాంటి విజయ యాత్రలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ చర్యలతో పాటు ధిక్కరణ చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.